ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి సంబంధించి వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ ధరల ప్రతిపాదనలపై అమలాపురం పరిధిలోని ఈదరపల్లిలోని ఎస్ఈ కార్యాలయంలో మంగళవారం బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్ఈ రాజబాబు, ఈఈ రవికుమార్ విద్యుత్తు నియంత్రణ మండలికి సంబంధించిన అన్ని డిస్కంల టారిఫ్ ఫైలింగ్ పై సూచనలు, అభ్యంతరాలను స్వీకరించారు.