108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద సోమవారం జిల్లాలోని 108 ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జిల్లా జనరల్ సెక్రటరీ పోతురాజు, ట్రెజరరీ చిట్టిబాబు ఆధ్వర్యంలో ఉద్యోగులు రిలే ఈ దీక్ష నిర్వహించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, లేదంటే 25వ తేదీ నుంచి సమ్మె చేస్తామని వారు హెచ్చరించారు. వారికి సీఐటీయూ నాయకులు బలరాం మద్దతు తెలిపారు.