పదవ తరగతి సోషల్ పరీక్ష మంగళవారం యధావిధిగా జరుగుతుందని అంబేడ్కర్ కోనసీమ డీఈవో సలీం భాషా సోమవారం తెలిపారు. ఒకటవ తేదీ సోమవారం ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా ప్రకటిస్తూ జీవో జారీ చేసిందన్నారు. కావున రేపు జరగాల్సిన సోషల్ పరీక్ష యధావిధిగా జరుగుతుందని చెప్పారు. జిల్లాలోని డివైఈవోలు, ఎంఈవోలు, జడ్పీహెచ్ స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. విద్యార్థులందరికీ విషయం తెలియపరచాలన్నారు.