వచ్చే సీజన్లో గ్రామాలలో ప్రజా ఉపయోగకరమైన ఉపాధి హామీ పథకం పనులను నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని ఎనర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లకు అల్లవరం ఎంపీడీవో కృష్ణమోహన్ సూచించారు. అల్లవరం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆయన ఫీల్డ్ అసిస్టెంట్లతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీ చెరువుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.