సుస్థిరమైన గ్రామ అభివృద్ధి ప్రణాళిక శిక్షణ కార్యక్రమం అమలాపురం మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. సర్పంచులు, కార్య దర్శులు, సచివాలయ ఉద్యోగులు, ఏఎన్ఎంలకు శిక్షణ నిర్వహించారు. డీఎల్డీవో త్రినాధరావు, ఎంపీపీ కుడుపూడి భాగ్యలక్ష్మిలు శిక్షణ తరగతులను ప్రారంభించారు. గ్రామపంచాయతీ అభివృద్ధి, ఆరోగ్యం, తాగునీరు, పచ్చదనం పరిశుభ్రత పై ఈవోపీఆర్డి, మంగాదేవి, రాము అనంతలక్ష్మి అవగాహన కల్పించారు.