అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 385 గ్రామ పంచాయతీలకు సంబంధించి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలలో ప్లాస్టిక్ నుసేకరించేందుకు ఏజెన్సీ, కంపెనీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు.ఈ మేరకు ఆమె మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.అర్హత కలిగిన వారు ఈనెల 20న ఉదయం 10: 30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు డాక్యుమెంట్లతో అమలాపురంలోని తన కార్యాలయంలో సంప్రదించాలన్నారు.