అమలాపురం పట్టణ పరిధిలోని కొంకాపల్లిలో విజయదశమి సందర్భంగా శనివారం సాయంత్రం చెడీ, తాలింఖానా విన్యాసాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కత్తి తిప్పుతూ కర్రలతో విన్యాసాలు చేస్తూ ఆకట్టుకున్నారు. దసరా ఉత్సవాలకు హైలెట్గా నిలిచే ఈ విన్యాసాలను వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు.