స్వచ్ఛ భారత్ దివాస్ కార్య క్రమంలో భాగంగా అమలాపురం కలెక్టరేట్ లో బుధవారం జరిగిన సమావేశంలో మామిడికుదురు మండలం లూటుకుర్రు గ్రామ సర్పంచ్, పి. గన్నవరం నియోజకవర్గం సర్పంచుల సమాఖ్య అధ్య క్షులు అడబాల తాతకాపు గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా సేవ సంకల్ప అవార్డు అందుకున్నారు. జేసీ నిశాంతి ఈ అవార్డును సర్పంచుకు అందజేశారు. మగటపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి పట్టిలింగం కూడా ఈ అవార్డు అందుకున్నారు.