ఇది చెరువు కాదు.. బాస్కెట్ బాల్ గ్రౌండ్

52చూసినవారు
ఇది చెరువు కాదు.. బాస్కెట్ బాల్ గ్రౌండ్
అమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని బాస్కెట్ బాల్ గ్రౌండ్ చెరువును తలపిస్తుంది. తెలియని వాళ్లు ఎవరైనా చూస్తే దీన్ని చెరువు అనుకుంటారు. కానీ దాని వివరాలు తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యపోతారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాస్కెట్ బాల్ గ్రౌండ్ చెరువులా మారింది. దీన్ని అధికారులు పట్టించుకోకపోవడంతో భారీగా నిలిచిన నీటి నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు సోమవారం చెప్పారు.

సంబంధిత పోస్ట్