కోనసీమ క్రీడోత్సవాల్లో భాగంగా మండల స్థాయిలో నిర్వహించిన పలు ఆటల పోటీలలో కామనగరువు పాఠశాల విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. బాలుర విభాగంలో షార్ట్ పుట్ లో ఎన్. యశ్వంత్ ప్రథమ స్థానం సాధించాడు. బాలికల విభాగంలో వాలీబాల్ ప్రథమ స్థానం, ఖోఖో, షటిల్ బ్యాడ్మింటన్ లలో ద్వితీయ స్థానం, లాంగ్ జంప్ లో ఎ. పూజిత ప్రథమ స్థానం, షాట్ పట్ లో వై. వి. ఆర్. తులసి తృతీయ స్థానం సాధించారని పిడి గొలకోటి శ్రీనివాస్ గురువారం తెలిపారు.