మలికిపురం మండలం గుడిమెల్లంక గ్రామంలోని కట్టా గణేశ్వరరావు ఇంటిలో గురువారం పాము ఇంటి యజమానులను ఆందోళనకు గురి చేసింది. దీంతో వారు స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అతను వంట గది షేడ్ పై ఉన్న పాముని కిందకు దించి దాన్ని బంధించారు. ఆ పాముని సుదూర ప్రాంతానికి తీసుకువెళ్లి విడిచి పెట్టడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.