అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని నాలుగు మండలాలలోని 11 గోదావరి వరద ప్రభావిత గ్రామాలలో ప్రజలకు ముమ్మరంగా సహాయక చర్యలు అందించడం జరుగుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ గురువారం తెలిపారు. జిల్లాలో ఏడు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 15 కుటుంబాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. 2, 082 ఆహార పోట్లాలను వరద బాధితులకు పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయన్నారు.