కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ అలైన్మెంట్ ప్రకారం అడ్డంకిగా ఉన్న అంశాలపై సంపూర్ణంగా సర్వే చేసి నివేదిక సమర్పించాలని ఆయా శాఖలకు చెందిన అధికారులను కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఆదేశించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లో బుధవారం ఆర్డీవోలు, తహసీల్దారులతో సమావేశం నిర్వహించారు. రైల్వే లైన్ కి అడ్డంకి గా ఉన్న నిర్మాణాలు పై సర్వే చేసి రిపోర్టు సమర్పించాలన్నారు.