స్వచ్ఛభారత్ నిర్వహించిన సోము వీర్రాజు

69చూసినవారు
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షుడు యాళ్ల దొరబాబు ఆధ్వర్యంలో అమలాపురం ఆర్టీసీ బస్టాండ్ వద్ద బుధవారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బేజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పాల్గొని బస్టాండ్ ఆవరణలో స్వచ్ఛభారత్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని ఉద్దేశంతో ప్రధాని మోడీ స్వచ్ఛభారత్ ను మొదలుపెట్టారన్నారు.

సంబంధిత పోస్ట్