అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద బుధవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలలో భాగంగా స్వచ్ఛత దివాస్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ పాల్గొని మహాత్మా గాంధీ ఆశయ సాధనలో భాగమైనా పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరు పాటించాలని అన్నారు. అధికారులు స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందరావు, అధికారులు పాల్గొన్నారు.