వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు కొండేటి చిట్టిబాబు ఆరోపించారు. బుధవారం అమలాపురంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం చేయాలని కూటమి ప్రభుత్వం కుట్రలు సాగిస్తుందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన అన్నారు.