అమలాపురం అర్బన్ హెల్త్ సెంటర్ ను వెంటనే ప్రారంభించాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా సీపీఎం కన్వీనర్ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రారంభానికి నోచుకోని అమలాపురం అర్బన్ సెంటరు సీపీఎం జిల్లా నాయకులతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. నిర్మాణం పూర్తయిన అర్బన్ హెల్త్ సెంటర్ను తక్షణమే ప్రారంభించి ప్రజలకు వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.