అనపర్తి: ఈనెల 21 నుంచి పశు వైద్య శిబిరాలు

81చూసినవారు
అనపర్తి: ఈనెల 21 నుంచి పశు వైద్య శిబిరాలు
అనపర్తి మండల పరిధిలో పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు సహాయ సంచాలకులు డా. శ్రీనివాస రావు సోమవారం తెలిపారు. ఈ నెల 21వ తేది నుంచి 25 వ తేది వరకు షెడ్యూల్ ప్రకారం గ్రామాలలో పశువులకు నట్టల నివారణ, టీకాలు, గర్భకోశ వ్యాధుల నిర్ధారణ, సాధారణ ఆరోగ్య సమస్యలను వైద్యులు గుర్తిస్తారన్నారు. వాటికి తగిన చికిత్స అందచేస్తామని తెలిపారు. రైతులు ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్