కొంకుదురు సంక్రాతి సంబరాలలో భాగంగా జరిగిన కబడ్డీ టోర్నమెంట్ లో మహిళా విభాగం విజేతగా భీమవరం (88 డ్రాగన్స్) విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్ లో భీమవరం జట్టు 36-20తేడా తో రాజమండ్రి జట్టును ఓడించింది. 3వ స్థానాన్ని పాలకొండ, 4వ స్థానాన్ని పటవల సాధించాయి. కొమరిపాలెం డీ సీ చైర్మన్ వేణుగోపాలరెడ్డి, సర్పంచ్ వీరమణి నాగిరెడ్డి తదితరులు విజేతలకు బహుమతులు అందజేశారు.