అంబాజీపేట మండలంలో ఓ గ్రామానికి చెందిన వివాహిత తన రెండేళ్ల కొడుకుతోపాటు ఈ నెల 22వ తేదీ రాత్రి నుంచి కనిపించడం లేదని ఆమె భర్త బాలాజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 23వ తేదీన ఆమె ఫోన్ చేసి తన కోసం వెతకొద్దని చెప్పి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందన్నారు. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేశామని అంబాజీపేట ఏఎస్ఐ ప్రసాద్ గురువారం తెలిపారు. దీనిపై విచారణ చేపట్టామన్నారు.