దీపావళి సందర్భంగా అంబాజీపేట మండలంలో ఏర్పాటు చేసే దుకాణాల కోసం తాత్కాలిక లైసెన్సులకు దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మార్వో వెంకటేశ్వరి సూచించారు. మండల రెవెన్యూ కార్యాలయంలో గురువారం ఎమ్మార్వో బాణాసంచా విక్రయదారులతో సమావేశం నిర్వహించారు. లైసెన్స్ కోసం దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డ్, పాన్ కార్డు, జీఎస్టీ రసీదు, ఒరిజినల్ చలానా అందించాలన్నారు. లైసెన్సు కోసం కొత్తపేట ఆర్డీఓ కార్యాలయానికి సిఫార్సు చేస్తామన్నారు.