గోపాలపురం మండలం ఉప్పరగూడెం గ్రామంలో ఫ్రైడే- డ్రైడే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఈ క్రమంలో ఆశ వర్కర్ మరియమ్మ మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో ప్లాస్టిక్, వ్యర్థ పదార్థాలు, కుండీలలో నాచు పట్టిన నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.