తిరుపతి తొక్కిసలాటలో చనిపోయిన ప్రతి భక్తుని కుటుంబాలకు ప్రభుత్వం కోటి రూపాయిలు ఇవ్వాలని కాంగ్రెస్ జిల్లా నేత విశ్వేశ్వరరెడ్డి గోపాలపురంలో డిమాండ్ చేశారు. ఈ తొక్కిసలాటకు టీటీడీ చైర్మన్, ఆ చైర్మన్‌ను నియమించిన చంద్రబాబే కారకులన్నారు. సెల్ ఫోన్ ద్వారా తిరుపతి టికెట్లను బుక్ చేసుకునే సౌలభ్యం కల్పించాలన్నారు. కాగా గతంలో పుష్కరాలకు చంద్రబాబు వచ్చిన సమయంలో 27 మంది మృతి చెందారని గుర్తు చేసుకున్నారు.