జగ్గంపేట సెంటర్ కాట్రావులపల్లి ఆటో స్టాండ్ మొత్తం 110 మంది ఆటో ఓనర్ కమ్ డ్రైవర్స్ తో ఆదివారం సిఐ వైఆర్ కె శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని, ముఖ్యంగా స్కూల్ పిల్లలను దింపే ఆటోలు పరిమితికి మించి ఎక్కించుకోరాదని సూచించారు. హైవేలో ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి డ్రైవరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని కోరారు.