అల్ట్రాసౌండ్ స్కానింగ్ ప్రక్రియను గర్భస్థ పిండ లింగ నిర్థారణల కోసం దుర్వినియోగం కాకుండా నివారించేందుకు జిల్లాలోని స్కానింగ్ సెంటర్లపై నిశితమైన నిఘా, పర్యవేక్షణలు కొనసాగించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆధికారులను ఆదేశించారు. కాకినాడలో శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కోర్టు హాలులో గర్భస్థ పిండ లింగ నిర్థారణ, నిషేధ చట్టం అమలు పై జిల్లా స్థాయి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.