పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి కేసును వేగవంతం చేయాలని పాస్టర్స్ జేఏసీ క్రైస్తవ బోధకులు బిసఫ్ జోసఫ్ బిన్నీ, బిసఫ్ జ్యోతి కుమార్, రిక్కీ గూటం, రమణ రాజు, శేషు బాబ్జి పేర్కొన్నారు. సోమవారం క్రైస్తవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలోపాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి కేసును విచారణ వేగవంతం చేయాలని శాంతి ర్యాలీ నిర్వహించారు. కాకినాడ భానుగుండు సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ వరకు ర్యాలీ కొనసాగింది.