కాకినాడ పోర్టు నుంచి సముద్రంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. శుక్రవారం కాకినాడ పోర్ట్ ను ఆయన పరిశీలించారు. రేషన్ బియ్యం పట్టుబడిన స్టెల్లా ఎల్ నౌక వద్దకు ప్రత్యేక బోట్ లో పవన్ కళ్యాణ్ వెళ్ళారు. నౌకలో ఉన్న 38 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎవరు సరఫరా చేశారని అధికారులను ఆరా తీశారు. పోర్ట్ నుంచి ఇంత భారీగా బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.