త్వరలో జరగనున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎం. ఎల్. సి ఎన్నికల నిమిత్తం కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు శనివారం కాకినాడ జగన్నాధపురం తన క్యాంపు కార్యాలయంలో క్లస్టర్ యూనిట్ ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎం. ఎల్. సి ఎన్నికలో పోటీచేసే కూటమి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో నెగ్గించేందుకు కూటమి శ్రేణులు కృషి చేయాలని కోరారు.