కాకినాడ: ఇసుక మాఫియా ను అరికడదామని ఏపీ బిల్డింగ్, కన్ స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం కాకినాడలో రాష్ట్ర బిల్డింగ్, కన్ స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 11న కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగే భవన నిర్మాణ కార్మికుల ధర్నాను జయప్రదం చేయాలని వీరకమల్ యూనియన్ నాయకులు సూరిబాబు ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది.