ఈనెల 15న గుంటూరులో జరిగే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల సింహ గర్జన విజయవంతం చేయాలని కాకినాడ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల సంఘాల జేఏసీ గౌరవ అధ్యక్షులు పండు అశోక్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఏనుగుపల్లి కృష్ణ, కాకినాడ జేఏసీ అధ్యక్షులు లింగం శివ, మాతా సుబ్రహ్మణ్యం మంగళవారం కాకినాడలో శాంతి నివాస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.