మద్యం తాగి వాహనం నడిపిన 26 మందికి కాకినాడ మూడో స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నరసింహరావు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు చెప్పారు. 1 వ్యక్తికి 3 రోజులు, 10మందికి 2 రోజులు చొప్పున జైలు శిక్ష విధించారు. మిగిలిన 15 మందికి ఒక్కొక్కరికి 10, 000 చొప్పున రూ. 1, 50, 000 జరిమానా విధించారు. కాకినాడ ట్రాఫిక్-1టౌన్, కాకినాడ ట్రాఫిక్ 2టౌన్ పరిధిలో కేసులు నమోదు చేశారు.