వర్షాకాలంలో చల్లగా, హాయిగా ఉన్నా ఇది వ్యాధులు ముసురుకునే కాలమని ప్రముఖ వైద్యులు కుమార యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వర్షాలు కురవడంతో బ్యాక్టీరియా, వైరస్ తదితర ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉందన్నారు. దీంతో జలుబు, దగ్గు, గొంతులో కపం, వైరల్ ఫీవర్ వంటి వ్యాధులు వేధిస్తాయని అన్నారు.