గుజరాత్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. మంగళవారం కూడా కుండపోత వర్షం కురిసింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా వందలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటివరకూ 6 వేల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ వర్షాలకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.