కాకినాడ జిల్లాలో కోడి పందాలు. పందెం బరులు వద్దే గుండాట జోరుగా సాగుతున్నాయి. సోమవారం భోగి కావడంతో పలు ప్రాంతాల్లో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. కరప పందెం బరి గెలిచిన వారికి మహేంద్ర థార్ ను గిఫ్ట్ గా నిర్వాహకులు ప్రకటించారు. దీంతో భారీ స్థాయిలో పందాలు జరుగుతున్నాయి. కాకినాడ సిటీ రూరల్ ప్రాంతాల్లో విచ్చలవిడిగా కోడిపందాలు జరుగుతున్నాయి. మహిళలు కూడా భారీ స్థాయిలో కోడిపందాలు చూస్తున్నారు.