కాకినాడ: చిన్నారుల హక్కులను కాపాడాలి

81చూసినవారు
చిన్నారుల హక్కులను కాపాడుతూ బాల్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అన్నారు. బుధవారం కాకినాడలో జాతీయ బాలల హక్కుల వారోత్సవాలు, జాతీయ బాలల హక్కుల దినోత్సవం కాకినాడ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాలల లైంగిక దాడులు జరగకుండా అందరు బాధ్యత తీసుకోవాలన్నారు. బాలల హక్కులకు భంగం కలిగించినా, బాల్య వివాహాలు అడ్డుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్