ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లో 37 కోట్లతో అభివృద్ధి చేసిన ఘనత కూటమి చేయడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామంలో పశువుల తొట్టి శంకుస్థాపన కార్యక్రమానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది మొదలైందని తెలిపారు.