కాకినాడ రూరల్: ఘనంగా తొలి తెలుగు కవయిత్రిమొల్ల జయంతివేడుకలు

54చూసినవారు
వాల్మీకి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో తెలుగులో రచించిన మొట్టమొదటి తెలుగు కవయిత్రిగా మొల్లమాంబ ప్రసిద్ధికెక్కిందని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం కాకినాడ రూరల్ మండలం బోట్ క్లబ్ వద్ద గల ఆమె విగ్రహానికి జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఎమ్మెల్యే పంతం నానాజీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్