కాకినాడ రూరల్: భగవంతుడు అంతటా ఉన్నాడు

63చూసినవారు
కాకినాడ రూరల్: భగవంతుడు అంతటా ఉన్నాడు
గాలి అంతట ఎలా ఉంటుందో ఆ గాలిని ఇచ్చే భగవంతుడు కూడా అంతటా ఉంటాడని పరిపూర్ణానంద స్వామి అన్నారు. కాకినాడ రూరల్ పీఠంలో జరుగుతున్న 'మహాశక్తి యాగం' కార్యక్రమంలో భాగంగా బుధవారం సుమారు 30 వేల మంది విద్యార్థినీ విద్యార్థులతో త్రికోటి సరస్వతి పూజ ఘనంగా నిర్వహించారు. సరస్వతీ మాత ఫోటో, పూజా సామాగ్రి నిర్వాహకులు అందజేయగా విద్యార్థులు ఈ పూజలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్