పండగ వాతావరణం లో సంక్రాంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం హైస్కూల్ వీధిలో టీడీపీ ఆధ్వర్యంలో 3వ సంవత్సరం సంక్రాతి ఆటల పోటిల ముగింపు ఉత్సవాలను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొని విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమం లో కూటమి నాయకులు పాల్గొన్నారు.