అంగరలో డెంగ్యూ వ్యాధి మాసోత్సవాలు...--సి హెచ్ సి వైద్యాధికారి డా. పి.రత్న కుమారి

165చూసినవారు
అంగరలో డెంగ్యూ వ్యాధి మాసోత్సవాలు...--సి హెచ్ సి  వైద్యాధికారి డా. పి.రత్న కుమారి
జాతీయ డెంగ్యూ వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సి హెచ్ సి వైద్యాధికారి డా. పి రత్న కుమారి అధ్యక్షణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది ఆశా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో ప్రబలే వ్యాధుల వల్ల వచ్చే కీటక జనీత వ్యాధులు డెంగు, మలేరియా, చికెన్ గుణ్య, బోధకాలు, మెదడు వాపు లాంటి ప్రబలకుండా , దోమలు వృద్ధి చెందకుండా, నీటి నిల్వలు లేకుండా ప్రజలు తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని సూచించారు.

డెంగ్యూ వ్యాధికి సరైన సమయానికి రోగ నిర్ధన జరగకపోతే మరణానికి దారి తీస్తుంది అని డెంగ్యూ- వ్యాధి నిర్ధరణ మరియు నివారణ పై అవగాహన సురక్షతకు సహాయపడుతుంది అని తెలియజేశారు. ప్రతి శుక్రవారం నాడు డ్రై డే నిర్వహించాలి అని దోమకాటు నుంచి రక్షణ గా దోమ తెరలు వాడాలి అని అన్నారు. జ్వరం తో బాధ పడే వారు వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించికోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సి. హెచ్. ఎస్ - ఎస్. ఎల్ కుమారి, హెల్త్ సూపర్వైజర్ పి. సురేష్ , టి. మేరీ మణి, ల్యాబ్ టెక్నిషియన్ ఎ. ఆలీ, ఎమ్ ఎల్ హెచ్ పి లు , ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్