కొత్తపేట నూతన ఆర్డీవో గా శ్రీకర్ బాధ్యతల స్వీకరణ

58చూసినవారు
కొత్తపేట నూతన ఆర్డీవో గా  శ్రీకర్ బాధ్యతల స్వీకరణ
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఆర్డీవోగా పి. శ్రీకర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆర్డీవో శ్రీకర్ కు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బదిలీపై వెళుతున్న జివివి సత్యనారాయణను ఆర్డీవో కార్యాలయ ఉద్యోగులు దుస్సాలువా పూలమాలతో ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఇటీవల ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆర్డీవోలను బదిలీ చేసిన విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్