కొత్తపేట మండలం మందపల్లి ఇసుక ర్యాంపును ఆర్డీవో శ్రీకర్ శనివారం తహసిల్దార్ రాంబాబుతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక కావలసిన వారు ముందుగా స్థానిక సచివాలయం లో సాండ్ పోర్టల్ ద్వారా రసీదు పొందిన తర్వాత మాత్రమే ఇసుక తీసుకు వెళ్లాలని సూచించారు. పోర్టల్ లో జనరల్ కన్జ్యూమర్ అని కాకుండా లోకల్ కన్జ్యూమర్ ఆప్షన్ ద్వారా మాత్రమే రసీదును జారీ చేయాలని డిజిటల్ అసిస్టెంట్లకు సూచించారు.