సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కొత్తపేటలో అత్యంత వైభవంగా జరిగే ప్రభల మహోత్సవాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మంగళ వారం దర్శించుకున్నారు. గ్రామదేవతలైన ప్రభలు రైతులు, ప్రజలను ఎల్లకాలం ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో సుభిక్షంగా ఉండేలా ఆశీర్వదించాలని కోరుకున్నారు. ఆయన వెంట కూటమి నాయకులు కంఠం శెట్టి శ్రీనివాసరావు, బూసి భాస్కరరావు, ధర్నాల రామకృష్ణ, విళ్ళ మారుతి పాల్గొన్నారు.