ఆలమూరు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని మండపేట మండలంలో సోమవారం నిర్వహించిన దాడులలో 75లీటర్ల నాటుసారాతో ఇరువురుని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఐడి నాగేశ్వరరావు తెలిపారు. మండపేట మండలం కేశవరం గ్రామంలో కడగాలి రాంబాబును 70లీటర్ల నాటుసారాతోను, ఏడిద సావరంలో 5లీటర్ల సారాతో కాండ్రేగుల సూరిబాబును అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఐ రాంబాబు సిబ్బంది పాల్గొన్నారు.