సమాజంలో ప్రతి మహిళ అప్రమత్తతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని మహిళా సాధికారత సెల్ కన్వీనర్ డాక్టర్ సుమలత ప్రముఖ న్యాయవాది ఎస్. విమల మహిళలకు ఉద్బోధించారు. రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ డాక్టర్ వి. శ్రీనివాసరావు అధ్యక్షతన "మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులు - వాటి నివారణ చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమలత, విమల హాజరయ్యారు.