కొవ్వూరు నియోజకవర్గం మున్సిపల్ కార్యాలయం వెనుక సచివాలయంలో, రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో, కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో ఉచిత కుట్టుమిషన్ల శిక్షణా కార్యక్రమాన్ని సోమవారం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భావన రత్నకుమారి, రోటరీ చైర్మన్ తీగల రాజా, ఇతర నేతలు పాల్గొన్నారు.