కొవ్వూరు: టోల్‌గేట్ సమస్య పరిష్కరిస్తాం

65చూసినవారు
కొవ్వూరు: టోల్‌గేట్ సమస్య పరిష్కరిస్తాం
ఉచిత ఇసుక తరలిస్తున్న లారీలకు టోల్‌గేట్ వద్ద అదనపు నగదు వసూళ్లు చేయడంతో కొవ్వూరు గామన్ బ్రిడ్జి వద్ద లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శనివారం అక్కడికి వెళ్లారు. అసోసియేషన్ సభ్యులతో మాట్లాడారు. లారీలకు అదనపు రుసుము లేకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని నచ్చజెప్పారు. దీంతో ఆందోళన సద్దుమణిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్