కొవ్వూరు: పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే ముప్పిడి

78చూసినవారు
కొవ్వూరులోని బి. ఆర్ అంబేద్కర్ గురుకులంలో శనివారం ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ మీటింగ్ లో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆయనకు స్వాగతం పలికారు. కొద్దిసేపు విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వారి అవసరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు ప్రోత్సాహంగా ఉంటే ఉన్నత స్థాయికి చేరుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీవీ రామారావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్