రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద కలెక్టర్ ప్రశాంతి, అదనపు జిల్లా మేజిస్ట్రేటివ్ ను కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నియోజవర్గంలోని మద్దూరులంకలో ముంపుకు గురైన ప్రాంతాలలో మరమ్మత్తు పనులు చేయుటకు నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత ఇసుక పాలసీని త్వరితగతిన ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని కోరారు.