ఆటో డ్రైవర్ లు విధిగా ట్రాఫిక్ నిభందనలు పాటించాలని మండపేట టౌన్ ఎస్ఐ హరి కోటి శాస్త్రి విజ్ఞప్తి చేసారు. మండపేట ట్రావెలర్స్ బంగళా వద్ద బుధవారం ఆటో డ్రైవర్ లతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సీజన్ లో ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకోరాదన్నారు. రద్దీ ఎక్కువగా వుండే సమయంలో రోడ్ కు అడ్డంగా పార్కింగ్ చేయకూడదన్నారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయరాదన్నారు.